పోలీసులతో ప్రజలు మమేకం కావాలి

4

– ప్రధాని మోదీ ఉద్భోధ

రణ్‌ ఆఫ్‌ కచ్‌: ‘పోలీసులు సున్నితత్వాన్ని తప్పక అలవర్చుకోవాలి. ఆ మేరకు ప్రజలతో మరింత మమేకమయ్యేలా పోలీసు శాఖ సంస్థాగత మార్పులు చేపట్టాలి. పోలీసుల సేవలను పౌరులు.. ప్రజల విజయాలను పోలీసులు పరస్పరం గుర్తించగలిగితే అది ఆదర్శవంతమైన పౌరసమాజంగా మారినట్లే’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌ లో జరుగుతోన్న డీజీపీల సదస్సు మూడోరోజైన ఆదివారం పోలీస్‌ బాస్‌ లను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘గడిచిన రెండు రోజులుగా ఇక్కడ జరిగిన చర్చలు, అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులు పరస్పరం పంచుకున్న అనుభవాలు నన్నెంతో ఆకర్షించాయి. మెరుగైన సమాజ నిర్మాణానికి విూరు చెబుతున్న సూచనలు ఆచరణీయం. పోలీస్‌ యూనివర్సిటీలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ వర్సిటీల ఏర్పాటు అవసరాన్ని గురించి కొందరు మాట్లాడారు. ఇంకొందరు సైబర్‌ సెక్యూరిటీ, సోషల్‌ విూడియా ద్వారా ప్రజాసేవపై విశదీకరించారు. ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించాలి. మరోవైపు ప్రజలతోనూ ఇంకా మమేకం కావలి. జనం తమ గుర్తింపును పోలీస్‌ స్టేషన్ల ద్వారా వెల్లడించగలగాలి. ఆ మేరకు సంస్కరణలు చేపట్టాలని కోరుతున్నా. దేశ సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉండే పోలీస్‌ స్టేషన్లు మరింత సహకారాత్మకంగా, సంయమనంగా పనిచేయాలి’ అని ప్రధాని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి కిరణ రిజిజు, అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.