హైదరాబాద్ : మరో కరుడుగట్టిన ఉగ్రవాది.. నాలుగేళ్ల పాటు పోలీసులకు ముచ్చెటమలు పట్టించిన వికారుద్దీన్‌ను ఎట్టకేలకు పోలీసులు మట్ట్టుబెట్టారు. ఖాకీలనే లక్ష్యంగా పెట్టుకుని వారిపై దాడులు చేసిన వికారుద్దీన్‌ను అంతమొందించారు. జైళ్లలో పోలీసులనే బెదిరించేవాడు వికార్. చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు జైలు అధికారులపై వికార్ దాడికి దిగాడు. వరంగల్ సెంట్రల్ జైలులో కూడా వికార్ పోలీసులను బెదిరించాడు. తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. ఇవాళ కూడా అదే పని చేశాడు. కానీ హతమయ్యాడు. పలుసార్లు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోబోయిన వికార్ గ్యాంగ్ భంగపడ్డది. డీజేఎస్ పేరుతో వికారుద్దీన్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించాడు. గతంలో సిమిలోనూ క్రియాశీలకంగా పని చేశాడు. 2008 సంతోష్‌నగర్, 2009 శాలిబండ, ఫలక్‌నూమాలో పోలీసులపై జరిపిన కాల్పుల కేసులో వికారుద్దీన్ ప్రధాన నిందితుడు.