పోలీసులు లక్ష్యంగా తాలిబన్ల దాడి: 14మంది మృతి
కాబుల్,మే22(జనం సాక్షి ): ఆఫ్గానిస్థాన్ మరోసారి తాలిబన్ల దాడులతో ఉలిక్కి పడింది. ఈసారి తాలిబన్ మిలిటెంట్లు పోలీస్ చెక్పాయింట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. ఆప్గాన్‌లోని తూర్పు ఘజ్ని ప్రావిన్స్‌లోని పలు జిల్లాలో తాలిబన్లు విరుచుకుపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో దాదాపు 14 మంది పోలీసు ఆఫీసర్లు మృతిచెందగా మరో 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. దిక్ యాక్ జిల్లాలో ఏడుగురు పోలీసు మృతిచెందారని ఆ ప్రావిన్స్ మంత్రి హసన్ రెజా వెల్లడించారు. మృతిచెందిన వారిలో పోలీస్ చీఫ్‌తో పాటు రిజర్వ్ పోలీస్ కమాండ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే జగాతూ జిల్లాలో మరో 7 మంది పోలీసులు చనిపోయారు.