పోలీసుల అక్రమ అరెస్టులు దారుణం : దేవిప్రసాద్
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పాలమూరు జేఏసీ చైర్మెన్ రాజెంధర్ రెడ్డితో సహాఉద్యోగ సంఘాల నాయకులను, విద్చార్ధులను అరెస్టు చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీ నామకులు దేవి ప్రసాద్ అన్నారు. పోలీసులు అక్రమ అరెస్టులను ఆపి రాజెంధర్ రెడ్డిని, తెలంగాణవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతిగా వ్యవహరాస్తే ప్రభుత్వం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.