పోలీసుల అదుపులో కి’లేడీ’ శైలు
హైదరాబాద్ జనంసాక్షి : ఐఏఎస్ అధికారినంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడీని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇప్పటివరకూ వందలాది మంది నుంచి డబ్బులు వసూసు చేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలు శైలును అదుపులోకి తీసుకొన్నారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు తరలి వస్తున్నారు.