పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు
ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని కొత్తగూడెంకు మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిరది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టుకు గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మావోయిస్టులు పరారీలో ఉన్నట్లు సమాచారం.