పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా
విద్యావిభాగం: పట్టణంలోని పోలీసు పెరేడ్ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాను జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు వందలకు పైగా సెక్యురిటీగార్డుల నియామకానికి ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.