పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి

పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 21 జనం సాక్షి.
దేశ ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే త్యాగం వెల కట్టలేనిదని, ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు.
శనివారం పోలీస్ అమరవీరుల అమరవీరుల దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారక స్థూపానికి జిల్లా అదనపు ఎస్పీ ఎన్.రవి తో కలసి ఘనంగా నివాళులర్పించారు.ముందుగా జిల్లా ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమం లో బాగంగా ఈ సంవత్సరం దేశవ్యాప్తoగా అమరులైన 189 మంది పోలీస్ అమరుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ చదివి వినిపించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబరు 21న పంజాబ్ కు చెందిన 21మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుoడగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూ బాగాన్ని ఆక్రమించెందుకు ప్రయత్నించడం తో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడిందని , ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారన్నారు. హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం కాని భారత జవాన్ల రక్తం తో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలం గా రూపు దిద్దుకుంని,ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అని అన్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసు అమరుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నామని అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం ప్రతి సంవత్సరం వారోత్సవాలు అనవాయితీగా నిర్వహిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణ త్యాగం చేసిన 189 మందిని స్మరిస్తూ వారికి జోగుళాoబ గద్వాల జిల్లా పోలీసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఏ పండగకు అయిన తమ పిల్లల పుట్టిన రోజులు అయిన, పెళ్లి రోజు అయిన వారి కుటుంబ సభ్యులతో హాయిగా జరుపుకోకుండా ప్రజల రక్షణగా రోడ్డుపై విధులు నిర్వహిస్తూ ప్రజల సంతోషాన్ని తన సంతోషంగా భావించి విధులు నిర్వహిస్తారని, వారికి అండగా నిలబడిన కుటుంబ సభ్యులకు ముఖ్యoగా పోలీస్ కుటుంబాలకు సెల్యుట్ తెలియజేశారు. పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ తమ కర్తవ్యం పట్ల నిజాయితీగా ఉంటుందని తెలియజేశారు.అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ మరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
ఆనంతరం పోలీస్ అమరవీరులను స్మరించుకుంటు పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది ర్యాలీని జిల్లా ఎస్పీ జెండ ఊపి ప్రారంభించారు. డి . ఎస్పీ కార్యాలయం నుండి బయలుదేరిన ర్యాలీ పోలీస్ అమరులకు జోహార్లు అంటూ నినాదిస్తూ , బ్యాండ్, డబ్బుల తో ముందుకు కొనసాగుతూ కృష్ణ వేణి చౌక్, న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండు వరకు కొనసాగింది. ర్యాలీ లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ముందుకు నడిపించారు. పాత బస్ స్టాండ్ వద్ద కళా బృందం సభ్యులు అమరుల త్యాగాలను స్మరిస్తూ పడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో
డి .ఎస్పీ పి. వెంకటేశ్వర్లు
,సాయుధ దళ డి.ఎస్పీ ఇమ్మనియోల్, సి.ఐ లు శ్రీనివాసులు , శివ శంకర్, బాగా వంత్ రెడ్డి, రాజు , రమా స్వామి, శివ కుమార్, రాజు, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు,పోలీస్ సిబ్బంది, బరోసా సిబ్బంది పాల్గొన్నారు.