పోలీసు ఆధీనంలో భద్రాద్రి

హెలీప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ

భద్రాచలం, జనంసాక్షి: పట్టణం, న్యూస్‌టుడే భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం స్వామివారి  పట్టాభిషేకం మహోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి , గవర్నర్‌ రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌, వసతి గృహం, కల్యాణ మండపం తదితర ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. సీఎం భద్రతా సాబ్బంది ముందుగా సీఎం వసతి గృహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో సీఎం భద్రతా సిబ్బంది భద్రాచలం హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఎస్పీ రంగనాథ్‌ సమక్షంలో హెలీప్యాడ్‌ భద్రతా చర్యలను పరిశీలించారు. హెలీప్యాడ్‌ వద్ద బారీకేడ్లు, మెటల్‌ డిటెక్టర్లు , ప్రత్యేక బలగాలతో ఈ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోవది. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించారు.