*పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో పెట్రోల్ బంక్ ఓపెనింగ్*
కోదాడ అక్టోబర్ 7(జనం సాక్షి)
కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా పోలీసు పెట్రోల్ భంక్ ను రాష్ట్ర డిజిపిమహేందర్ రెడ్డి అంతర్జాలం ద్వారా డీజీపీ కార్యాలయం నుండి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ఆరోగ్య భద్రత స్కీమ్ ద్వారా సిబ్బంది అవసరాలను తీరుస్తున్నామన్నారు. ఆరోగ్య భద్రత ద్వారా ఆరోగ్య పరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణం, వ్యక్తిగత రుణాలు, పిల్లల చదువులు, వివాహం అవసరాలకు కూడా సిబ్బందికి మార్కెట్ కంటే తక్కువ వడ్డీలకు ఆర్థిక సహాయం అందిస్తుమన్నారు. పోలీస్ కార్పస్ ను మరింతగా బలోపేతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఇందన కేంద్రాలు, పెళ్లి మండపాలు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో వెంటనే అనుమతి వచ్చేలా, ట్యాక్స్ రిలాక్సేషన్ ఉండేలా చర్యలు తీసుకున్నాం అన్నారు. ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రౌండ్ ది క్లాక్ పోలీసు విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో స్నేహ పూర్వక పోలీసింగ్ లో భాగంగా నాణ్యమైన పెట్రోల్ ను వినియోగదారులకు అందించి సేవలు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం, జిల్లాలో పోలీసు సంక్షేమం కోసం పలు జిల్లాలు, పోలీసు విభాగాల్లో పోలీస్ పెట్రోల్ భంక్ లు నిర్వహిస్తున్నాం అన్నారు. భారత్ పెట్రోలియం సంస్థ, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థ వారితో కలిసి రాష్ట్ర పోలీసు అకాడమీ, సూర్యాపేట జిల్లాలో పెట్రోల్ భంక్ లను ప్రారంభించాం అన్నారు.
మరో ముఖ్యఅతిథి జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డిజీపీ మహేందర్ రెడ్డి అధ్వర్యంలో ప్రజలకు విసృతమైన, సేవలు అందిస్తున్నాం అన్నారు, శాంతి భద్రతలు, సాంకేతికత సద అంశాల్లో దేశంలోనే తెలంగాణ పోలీసు మొదట ఉన్నదన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమం లో భాగం అనేక జిల్లాలో పోలీస్ పెట్రోల్ భంక్ ఏ సూర్యాపేట జిల్లాకు సమన్వయంతో నిర్వహిస్తాం అని తెలిపారు. ద్వారా వినియోగదారులక అని ఎస్పీ తెలిపార సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి ప సహకరించిన పెట్రోలియం సంస్థకు ధన్యవాద జరిగినదన్నారు.సి సమన్వయంతో నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారం ఉన్న కోదాడ పట్టణంలో ఏర్పాటు చేశాం అన్నారు. బస్టాండ్ కు ఎదురుగా ఉంది, 25 వేల లీటర్ల పెట్రోల్, 35 వేల డీజిల్ స్టోరేజ్ సామర్థ్యం తో ఏర్పాటు చేశాం అన్నారు.
కోదాడ లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో డిఎస్పీ లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, ఆర్డీవో కిషోర్ , హెచ్ పి సంస్థ అధికారులు సిద్దార్థ్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ మేనేజర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిఐలు శివ శంకర్, ఆంజనేయులు,పి.ఎన్.దే ప్రసాద్, అర్ .ఐలు పోలీస్ ఎంటిసి శ్రీనివాస్, శ్రీనివాస రావు, గోవిందరావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు రామచందర్, ఎస్సైలు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail