పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఆర్ కె ఆర్
మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు
సమాజంలో పోలీస్ పాత్ర ఎంతో కీలకమైంది.
వృత్తిని దైవంగా భావించే నిస్వార్థ సేవకుడే పోలీస్
పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 22 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని సీ టైపులోని ఇల్లందు క్లబ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతలను సంరక్షిస్తూ ప్రజల జీవితాలకు,ఆస్తులకు రక్షణ కల్పిస్తూ నేరాలు, విధ్వంసాలు జరగకుండా కాపాడటం లో పోలిష్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు.రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ సమాజాన్ని సక్రమార్గంలో నడిపించేందుకు కృషి చేస్తోంది పోలీసులే అని అన్నారు. పోలీసు వృత్తి అనేక వత్తుడిలతో కూడుకున్నదని పోలీసులు తమ వృత్తి ధర్మం కోసం తమ కుటుంబాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో నిబద్దతతో పనిచేస్తున్నారని కొనియాడారు, కొందరు పోలీసులు కర్తవ్య నిర్వహణలో ప్రజల రక్షణే తమ బాధ్యతగా బావించి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. అలాంటి వారి త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు చేసిన త్యాగాలతో వారి కుటుంబానికి నష్టం జరిగినా ఎన్నో కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి. అలాంటి గొప్ప వ్యక్తుల త్యాగాలు అక్టోబర్ 21 న గుర్తు చేసుకోవడమే కాదు అలాంటి వారిని ఆదర్శoగా తీసుకొని సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు కోసం పని చేయాలని అన్నారు. అనంతరం రక్త దానం చేసిన పోలిష్ లకు పండ్లు, పండ్ల రసాలు అందచేశారు. కార్యక్రమంలో మణుగూరు డి ఎస్ పి కె.వి రాఘవేంద్రరావు , మణుగూరు సబ్ డివిజన్ సి ఐ లు, ఎస్ ఐ లు, కానిస్టేబుల్స్, కార్యాలయ సిబ్బంది, బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.