ప్యాకేజీల కోసమే తెరాసలో చేరుతున్నారు: పొంగులేటి

హైదరాబాద్‌: వ్యక్తిగత అజెండా ప్యాకేజీలతోనే నేతలు కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ అరోపించారు. రాజకీయ క్విడ్‌ ప్రోకోతోనే తెలంగాణ అంశాన్ని ముందుకు పెట్టి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ నేతలు, ఎంపీలను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన దూషణలు అందరికీ తెలుసని, దీక్ష దగ్గర జరిగిన అవమానాలను ఎంపీలు మరిచిపోతే… ఏం చేయగలమని వాఖ్యానించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు , సుబ్బిరామిరెడ్డి పరస్పర విమర్శలు మానుకోవాలని… పార్టీ పెద్దలు వారికి నచ్చజెప్పాలని సూచించారు.