ప్యాకేజ్‌ ఎందుకో త్వరలో తెలుస్తుంది

2

– నీతీష్‌ కుమార్‌

పాట్నా ఆగష్టు 23 (జనంసాక్షి):

మరో రెండు నెలల్లో బీహర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌కు రూ. 1.25 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై ఆ రాష్ట్ర

ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరోసారి మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ వెనుక దాగిన సత్యం త్వరలో బహిర్గతం కానున్నదని వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక ప్యాకేజీతో త్వరలో బీహర్‌లో నిజరూపాన్ని ఆవిష్కృతం చేస్తామని ఆదివారం పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. అంతేకాక బీహర్‌లో రూ. 19,499.13 కోట్ల ప్రాజెక్టులను

ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు, ప్రత్యేక ప్యాకేజీలతో కలిపి మొత్తంగా వేలకోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో

ఇతర రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.    బీహర్‌కు ప్రత్యేక ¬దా కావాలని తాను డిమాండ్‌ చేసినట్టు నితీష్‌ కుమార్‌ పునరుద్ఘాటించారు. బీహర్‌కు

హక్కులు సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. తాము ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బీహర్‌ ప్రత్యేక ప్యాకేజీని గత మంగళవారం ప్రధాని మోదీ బోజాపూర్‌ జిల్లాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీతో బీహర్‌ ముఖచిత్రమే మారనుందని వెల్లడించారు. కాగా, ఎన్‌డీఏ నేతృత్వంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో

ఆశించిన ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు నితీష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.