ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా వైద్యశాఖలో ఉన్న ఖాళీలే నిదర్శనం

కరీంనగర్‌ (జనంసాక్షి): ‘పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పోరేటు స్థాయిలో వైధ్యం అందిస్తున్నాం..’ ఇది మన ప్రభుత్వం పదేపదే చేప్పే మాటలు… చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అందిస్తున్న వైధ్య సేవలకు అసలు పొంతన లేకుండా పోతుంది. ఇందుకు జిల్లా వైద్యశాఖలో ఉన్న ఖాళీలే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రజా ఆరోగట్యంపై సర్కారు చిన్న చూపు చూస్తోంది. వైధ్యశాఖలో ఖాళీలను భర్తీచేసి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిచేందుకు కృషి చేయాల్సి ఉండగా… ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. కాంట్రాక్టు పద్దతిలో తీసుకున్న వారిని కొనసాగించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైధ్య సేవలు అందించడమేగాకుండా ఎక్కడి వారికి అక్కడే సుఏవలు అందించేందుకు దివంగత నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన 104, 108 వ్యవస్థను దశలవారీగా నిర్వార్యం చేస్తోందని పలువురు భాహాటంగానే విమర్శిస్తున్నారు. 108 అంతంతమాత్రంగా నదుస్తుండగా.. 104 గ్రామ పోలిమేరకు రావడంలేదని ప్రచలు చెబుతున్నారు.
ఖాళీలు… ఖాళీలు జిల్లా వ్యాప్తంగా వైధ్య ఆరోగ్యశాఖలో 511 ఉద్యోగా ఖాళీలున్నాయి. మొత్తం 3061 పోస్టులకు గాను 2550 పోస్టులకు గాను 2550 పోస్టులకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. 793 మందతిని కాంట్రాక్టు పద్దతిలో పసిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రధానాస్పత్రి మినహా జిల్లాలో 166 డాక్టరు పోస్టులుండగా… ఇందులో 93 మంది కాంట్రాక్టు పద్దతిలో, 73 మంది రెగ్యులర్‌గా సనిచేస్తుండగా… 4 పోస్టులకు ఖాళీలున్నాయి. మొత్తం జిల్లాలో 9 డాక్టర్‌ పోస్టులు, 13 స్టాఫ్‌నర్స్‌ ఖాళీలున్నాయి. నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో మొత్తం 14 పోస్టులు ఖాళీలున్నాఏయి. ఆస్పత్రికి రోజు సగటున ఓపీ పేషెంట్లు 900 మంది వరకు వస్తుంటారు. ఇన్‌పేషెంట్లుగా 100 మంది చేరుతున్నారు. ఈ సంఖ్య వ్యాధల సీసన్‌లో రెండింతలు పెరుగుతుంది. ఆస్పత్రిలో మొత్తం 350 పడకల సామర్థ్యం కల్గిఉంది. నలుగురు గైనకాలజిస్టులు అవసరం ఉండగా.. ఇద్దరు పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో ఐదు డాక్టర్‌ పోస్టులకు ఖాళీలున్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 11 పోస్టులకుగాను 8మంది ఉండగా 3 ఖాళీలున్నాయి. డిప్యూటీ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 1, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ 1 పోస్టు ఖాళీ ఉంది. స్టాఫ్‌ నర్స్‌ 78 కి గాను 16 మంది సనిచేస్తుండగా 2 ఖాళీలున్నాయి. నర్సీంగ్‌ సూపరింటెండ్‌ గ్రేడ్‌వన్‌ 1,ఎల్‌ఎస్‌ గ్రేడ టూల ో 1, ఖాళీలున్నాయి.