ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ
టీఆర్‌ఎస్ పాలనలో మహిళలకు గౌరవం
బతుకమ్మ కానుక చరిత్రాత్మకం
గంగా జమున తహజీబ్ కు బతుకమ్మ పండుగ ప్రతిబింబం
సూర్యాపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట (జనంసాక్షి):శాంతి సామరస్యానికి , పరమత సహనానికి మహిళలు అందరూ కలిసి జరుపుకునే బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఉండాలనే ఉద్దేశ్యతోనే సీఎం కేసీఆర్, ఆడపడుచులకు చీరల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.మనదైన సంస్కృతి , ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ జాతికి మాత్రమే సొంతమని అన్నారు.ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు ఇస్తున్న దసరా కానుక చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.టీఆర్‌ఎస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందన్నారు.వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.2014కు ముందు గతంలో పాలించిన పాలకులు ఏ మత సంప్రదాయాలను, సంస్కృతుల ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దమని అభివర్ణించారు.2014కు ముందు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ , 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు లేవన్నారు.ప్రజలను ప్రేమించే సీఎం కేసీఆర్ వచ్చాకే ఈ పథకాలు వచ్చాయన్న విషయాన్ని గమనించాలని కోరారు.ప్రజలపై ప్రేమ ఉన్నప్పుడే అటువంటి పథకాలు వస్తాయని అన్నారు.పీఎం మోడీ సొంత రాష్ట్రంలో ప్రజలు తెలంగాణ తరహా పథకాల కోసం డిమాండ్ చేస్తున్నారని అన్నారు.ఆ కారణంతోనే టి.ఆర్ఎస్ ప్రభుత్వంపై పీఎం మోడీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు.అనంతరం రాజ్యసభ ఎంపీ బడుగుల యాదవ్ మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే మంత్రి జగదీష్ రెడ్డివంటి నాయకుడిని తన రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదన్నారు.సద్దుల చెరువును టాంక్ బండ్ గా మార్చడమే కాకుండా,రహదారుల విస్తరణ, మెడికల్ కళాశాలను తెచ్చి ప్రజల జీవితాలను మార్చివేశారని అన్నారు.సందర్బం ఏదైనా మహిళా లోకం మంత్రి జగదీష్ రెడ్డికి అండగా నిలబడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ , గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా దేవి ఆనంద్, మున్సిపల్ కమీషనర్ సత్యనారయణ రెడ్డి , వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ,పట్టణ ప్రదాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్ , కౌన్సిలర్లు లక్ష్మి కాంతమ్మ , రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి గౌడ్, ఎలిమినేట్ అభినయ్, చింతల పాటి భరత్, బత్తుల లక్ష్మి జానీ, లీల లింగా నాయక్,మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్ , సల్మా, కరుణ శ్రీ, రాచూరి రమణ, ఢిల్లీ పావని, అంజమ్మ , కక్కిరేని నాగయ్య , బైరు వెంకన్న , ఏల్గూరి రాంబాబు గౌడ్, గుండపునేని కిరణ్ , రమాకిరణ్ తదితరులు పాల్గోన్నారు.