ప్రగతినివేదన సభకు భారీగా ముస్లింలు
పాతబస్తీ నుంచి తరలి వస్తారన్న డిప్యూటి సిఎం
హైదరాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): ఆదివారం కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే ప్రగతి నివేదన సభకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలి రావాలని డిప్యూటీ సీఎం మహముద్ అలీ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముస్లిం ప్రజాప్రతినిధులతో కలిసి మహముద్ అలీ విూడియాతో మాట్లాడారు. ముస్లింల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పాతబస్తీ నుంచి ప్రగతి నివేదన సభకు మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముస్లింలు అంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ముస్లింలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముస్లింలు అంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ స్పష్టం చేశారు. ప్రగతి నివేదన సభకు ముస్లింలు అంతా తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారు అని ఎమ్మెల్సీ సలీం పేర్కొన్నారు



