ప్రచారానికే పథకం: మందకృష్ణ

సికింద్రాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఫార్స్‌గా నిలుస్తుందని, బియ్యం కోటాను పెంచకుండా కేవలం ప్రచారానికే పథకాన్ని వినియోగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ సంస్థ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుపు రంగు రేషన్‌కార్డుల వారికి బియ్యం కోటాను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 15నుంచి రాష్ట్రవ్యాప్తంగా అకలికేకల పోరు యాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్‌ 30న వరంగల్‌లో మహాధర్నాను నిర్వహిస్తామని, ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని మమ్మరం చేస్తామని మందకృష్ణ మాదిగ విమర్శించారు.