ప్రజలకు భద్రత ఏది? ప్రధాని నరేంద్ర మోడీ


– కర్ణాటకలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి

– ప్రజాకాంక్షకు అనుగుణంగా పని చేసేది బీజేపీనే
– యడ్యూరప్పే సీఎం పీఠం అదిరోహిస్తాడు
– బీజేపీది గాలి కాదు.. సునావిూ!
– రాహుల్‌కు బీజేపీని విమర్శించడమే పని
– దమ్ముంటే.. 15నిమిషాలు సిద్ధిరామయ్య ప్రభుత్వం అభివృద్ధి చెప్పు
– కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
– ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌, రాహుల్‌పై ప్రధాని విసుర్లు
బెంగళూరు, మే1(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు భద్రత కరువైందనిపేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చామరాజ్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో చట్టం సరిగ్గా అమలు కావటం లేదన్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. లోకాయుక్త ప్రమాదకర స్థితిలో ఉందని, అలాంటప్పుడు సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడుందని ప్రధాని ప్రశ్నించారు. సిద్ధరామయ్యది మాటల సర్కార్‌ మాత్రమేనని, మంత్రులు అవినీతి పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి కుంటుపడిందని, కర్ణాటకలో ఇప్పుడు 2ప్లస్‌1 ఫార్ములాతో రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రజలను పట్టించుకోకుండా నిద్రలో మునిగిపోయే ముఖ్యమంత్రుల ఆలోచనే ఇదన్నారు. ఇది కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయమని, కేంద్రం సాయం చేస్తుందంటే
నిరాకరిస్తారు.. మళ్లీ కేంద్రంపైనే విమర్శలు చేస్తారని ప్రధాని ఆరోపించారు. దిగజారుడు రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకోవటమే వారి లక్ష్యం’ అని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీజేపీని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని యద్దేవా చేశారు. ఆయనకు వారసత్వంపైనే నమ్మకం ఎక్కువని, ప్రధాని పీఠం ఎక్కాలని కలలుకంటున్నారని అన్నారు. ప్రజా నాడి ఏంటో ఆయనకు ఎప్పటికీ అంతుబట్టదనన్నారు. రాహుల్‌కి ఇదే నా సవాల్‌. ‘రాహుల్‌ జీ.. దమ్ముంటే ఓ 15 నిమిషాలపాటు కర్ణాటకలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి గురించి పేపర్‌ చూడకుండా మాట్లాడండి. హిందీ, ఇంగ్లీష్‌ లేదా విూ మాతృ భాషలో అయినా సరే. మాట్లాడండి చాలూ. బహుశా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆత్రంలో విూరు విచక్షణ మరిచి విమర్శలు చేస్తున్నారు. విూ పార్టీలో ఉన్న మాజీ ప్రధాని(మన్మోహన్‌ సింగ్‌) మాటలు కూడా విూరు వినట్లేదని తెలిసింది. కనీసం విూ తల్లి(సోనియాగాంధీని ఉద్దేశిస్తూ) చెప్పే మాటలైనా వినండి. ప్రజలను మూర్ఖులను చేయాలని ప్రయత్నించకండి’ అని మోదీ రాహుల్‌పై విమర్శలు సంధించారు. కర్ణాటకలో మార్పుల గురించి ఢిల్లీలో ఎప్పటికప్పుడు తెలుస్తుంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీజేపీ పని చేస్తోందన్నారు. ఇక్కడ కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కర్ణాటకకు కాబోయే సీఎం యాడ్యురప్పే’ అని మోదీ ఉద్ఘాటించారు. ఇక కేంద్రం సౌభాగ్య యోజన పథకం కింద 39 గ్రామాలకు.. 4 కోట్ల ఇళ్లకు కరెంట్‌ సరాఫరా చేసిందని.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నన్నాళ్లు ఆ పని చేయలేకపోయిందని మోదీ తెలిపారు. బీజేపీ గాలి వీస్తోందని అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ, ఇది బీజేపీ సునావిూ అని వాళ్లు గుర్తించాలి అని  మోదీ పేర్కొన్నారు.