ప్రజలతో మమేకమై ముందుకు సాగండి.!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రోహిత్ చౌదరి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 26 (జనంసాక్షి). కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని ఏఐసిసి సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రోహిత్ చౌదరి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం పట్టణంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రోహిత్ చౌదరి తో పాటు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలకు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రానున్న సహకార విద్యుత్ సంస్థ సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. సమావేశంలో ఆది శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, సాగరం వెంకటస్వామి, ఆకునూరు బాలరాజు, సూర దేవరాజు, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.