ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ జూలై 27, జనం సాక్షి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు.గ్రామాల్లోని పాత ఇండ్లు తడిసి కూలే ప్రమాదం ఉందని, ఇండ్లు కూలిన వారిని, కూలే ప్రమాదం ఉన్న వారిని ఆయా గ్రామాల డబుల్ బెడ్రూమ్, పాఠశాల,  రైతు వేధికల్లో ఉంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాగులు, చెరువులు, కుంటలు నిండి పొంగుతున్న సందర్భంగా ప్రజలు భయటకు వెల్లొద్దన్నారు.
రెవెన్యూ, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజల ఇబ్బందులను తెలుసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. యువకులు వాగులు, చెరువుల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగుతు ప్రమాదాలకు గురి కావద్దన్నారు.