ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారు

ఆప్యాయంగా విరాళాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు
అందుకే మరోమారు గెలిపించాలని తపిస్తున్నారు: మధుసూధనాచారి
జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతోందని మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. ప్రజలు ఇంతకాలం పాలకలు మాటలను నమ్మి మోసపోయారని, టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరవాతనే అభివృద్ది అంటే ఏమిటో కళ్లారా చూస్తున్నారని అన్నారు.  భూపాలపల్లి  మండలం గుడాడ్‌పల్లిలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇళ్లు, వీధి తిరిగిన స్పీకర్‌ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మధుసూదనాచారికి రూ. 46 వేలను ఎన్నికల విరాళంగా అందజేశారు. దీంతో ఆయన ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వ్యక్తం చేశారు. అభివృద్ది చేసే నాయకులను ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు. నాలుగేళ్ల కాలంలో తాను స్పీకర్‌గా ఉన్నా నియోజకవర్గ అభివృద్దికి, ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని అన్నారు. ప్రజలు మరింతగా అభివృద్ది జరగాలని ఆశిస్తున్నారని అన్నారు.  ప్రస్తుంత జరుగుతున్న అభివృద్ది కొనసాగాలంటే మరోమారు ప్రజల ఆశీస్సులు,  దీవెనలు కావాలని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ కాలనీ చూసిన మురుగు నీటితో దుర్గంధం వెదజల్లుతూ ఉండేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్‌ధ్దికి కృషి చేస్తోందన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కనిపిస్తోందన్నారు.  అభివృద్ధి పథకాల సాధన కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమనుకున్న ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తాము మల్లి గెలుస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆమలు చేసిన పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. అర్హులందరికి సంక్షేమ ఫలాలు చేరుతాయని చెప్పారు. ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు తమ పక్షాన్నే ఉన్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

తాజావార్తలు