ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినపుడే చట్టాలు విజయవంతంగా అమలు అవుతాయి
జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జితిన్
ఖానాపూర్ రూరల్ 8 అక్టోబర్ (జనం సాక్షి): చట్టాల అమలులో ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినప్పుడే చట్టాలు విజయవంతం గా అమలు అవుతాయని ఖానాపూర్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జితిన్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని కోలాం గూడెం లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన విజ్ఞాన సదస్సు లో ఆయన మాట్లాడుతూ నల్సా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుంతుంది అని అర్హులైన వారికి న్యాయవాధిని అందించడం ద్వారా వారియొక్క దవాలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆయన అన్నారు.అలాగే అక్కడ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక ఎసై రజినీకాంత్ మాట్లాడుతూ పౌరులు మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని,వాహనాలు నడిపినపుడు హెల్మెట్ ధరించాలని ,డ్రైవింగ్ నియమనిబంధనలు పాటించాలని ఆయన కోరారు.ఈ అవగాహన సదస్సు లో న్యాయ వాదులు వెంకట్ మహేంద్ర ,బాశెట్టి శివ,కోలాo గూడ సర్పంచ్,కోర్ట్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.