ప్రజల్లోకి వెళ్లి పోరాడండి

1
– దిగ్విజయ్‌

హైదరాబాద్‌,జులై 8(జనంసాక్షి):తెలంగాణలో చట్టబద్ధ పాలన సాగడం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని కేసీఆర్‌

సర్కారు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిల్‌ వేయాలని అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాంధీభవన్‌ ను వదిలి జనంలోకి వెళ్లి ప్రజాసమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలు పెంచుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. అవినీతి సొమ్ముతోనే ఇతర పార్టీల నేతలను కొంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్‌ కేసీఆర్‌ కుబుంబ సొమ్ము కాదు, ప్రజల సొమ్మున్నారు.గాంధీభవన్‌ లో మున్సిపల్‌ ప్రతినిధుల శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ శిక్షణా కార్యక్రమాన్ని రెండేళ్ల కిందటే నిర్వహించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పార్టీ పెద్దలు భరోసా కల్పించనందు వల్లే మున్సిపల్‌ చైర్మన్లు పార్టీ మారారని అన్నారు.