ప్రజల్లో ఎన్నికల పట్ల అత్మవిశ్వాసం కలిగేలా , సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్

వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి,

వనపర్తి బ్యూరో అక్టోబర్ 27( జనంసాక్షి)

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు వినియోగించుకునెలా వారిలో నమ్మకం, బరోసా, భద్రత కలిగేలా జిల్లా పోలీసులు, ఐటి బి పి కేంద్ర సాయుధ బలగాలచే ప్లగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ కవాతు ను పాలిటెక్నిక్ కాలేజ్ నుండి ప్రారంభమై
వివేకానంద చౌరస్తా, టౌన్ పోలీస్ స్టేషన్, శంకర్ గంజ్, గాంధీ చౌక్, గాంధీ నగర్, మారెమ్మ కుంట, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, బస్ డిపో మీదుగా టౌన్ హాల్
వరకు ఫ్లాగ్ మార్క్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత, బరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సమస్యత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని అన్ని మండలాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, అసెంబ్లీ ఎన్నికల లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్పోస్టులలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి ఆనంద రెడ్డి కేంద్ర సాయుధ బలగాల అసిస్టెంట్ కమాండెన్స్ టీ రాబిన్, ప్రమోద్ జా , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ , సిఐ లు మహేశ్వర్ శ్రీనివాస్ రెడ్డి రత్నం , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ అప్పలనాయుడు, ఎస్సై యుగంధర్ రెడ్డి జయన్న జలంధర్ రెడ్డి , ఆర్ఎస్ఐలు, వినోద్ సురేందర్ , పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నారు.