ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర: బండి సంజయ్

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్18
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగవ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆరవ రోజు మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్న ఆయనకు స్థానిక బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. మల్కాజిగిరి నుండి యాప్రాల్ వరకు ప్రజలకు అభివాదం చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర చేశారు.నిరుద్యోగ సమస్యపై యువకులు,స్థానిక సమస్యలపై ప్రజలు వినతిపత్రాలను అందజేశారు.
ఈసందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఎన్నికలు వస్తున్నాయని తూతూ మంత్రంగా దొంగ జీవోలు జారీ చేసి చేతులు దులుపుకుంటే వదిలే ప్రసక్తే లేదని తక్షణమే పది శాతం రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రెండు లక్షల 40 వేల ఇళ్లను ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కడికి వెళ్ళినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని ఎంఎంటిఎస్ కోసం కేంద్ర ప్రభుత్వం 6 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా 430 కోట్లు మంజూరు చేయక పనులు ఆగిపోయాయని అన్నారు.షిఫిల్ కాలనీ ముంపుకు గురవుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని,222 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు.ఎస్టీ రిజర్వేషన్లను అడ్డుకున్నది ఎవరో కేసీఆర్ సమాధానం చెప్పాలని,కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎస్టీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Attachments area