ప్రజల భద్రత కోసమే సిసి కెమెరాలు

   *మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని               తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 11:: ప్రజల భద్రత కోసమే సీసీ కెమెరాలు అని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ దేనిని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం కొండాపూర్ లో నాలుగు లక్షలతో వి ఎస్ టి యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆమె ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగానే సరిపోదు అని అవి నిర్విరామంగా 24 గంటలు పని చేసేటట్లు చూసుకోవాలని అన్నారు కొన్ని గ్రామాలలో రాత్రివేళ బందు చేస్తున్నారని అలా బంద్ చేస్తే నేరాలు రికార్డు కావాలి ఆమె తెలుపుతూ 24 గంటలు పనిచేసేటట్లు అన్ని కెమెరాలు పనిచేసేటట్లు గ్రామపంచాయతీ పాలకవర్గం చూసుకోవాలని ఆమె కోరారు ఇక్కడ ఎలాంటి చిన్న నేరాలు జరిగిన సీసీ కెమెరాలు వల్ల దొరికిపోతాయని దొంగతనాలు తో పాటు ఇతర గొడవలు ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాలు రికార్డు అయి భద్రంగా ఉంటుందని ఆమె తెలిపారు ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు కనీసం హెల్మెట్ పెట్టుకోవడం లేదని ఈ చిన్న ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోయే అవసరం వస్తుందని ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని బైక్ పై వెనుక సీట్ల కూర్చున్న వారు సైతం హెల్మెట్ పెట్టుకోవాలని మహిళలు సైతం హెల్మెట్ పెట్టుకోవడం నేర్చుకోవాలని ఆమె తెలిపారు ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు చేయాలని ఆమె తెలిపారు ఫోర్ వీలర్ వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఇలాంటి ప్రమాదాలు జరిగినా వారి ప్రాణాలను సీటు బెల్టు కాపాడుతుందని ఆమె అన్నారు జాతీయ రహదారిపై మీ గ్రామం ఉన్నందున రహదారిపై ఎక్కువ స్పీడ్ తో వచ్చే వాహనాలు వెళుతుంటాయని రహదారిపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని ఆమె సూచించారు వి ఎస్ టి కంపెనీ ప్రతినిధి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ గ్రామానికి వాటర్ ప్లాంటు రికార్డులు ఇచ్చామని భవిష్యత్తులో మరిన్ని గ్రామ అవసరాలు తీర్చడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి యాదగిరిరెడ్డి సిఐ శ్రీధర్ ఎస్సై రాజు గౌడ్ సర్పంచ్ మమత రవి వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Attachments area