ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్పించిన పోలీసులు మహనుభావులు:జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సంధర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆద్వర్యంలో జిల్లా పోలీసు ఎ.అర్. హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి. ప్రతిమ సింగ్ గారు, జిల్లా అదనపు ఎస్.పి.డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు, మరియు పోలీస్ అధికారులు పోలీసు అమర వీరుల స్థూపానికి నివాళలు అర్పించారు. ఈ సంధర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్.పి.డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు, గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 264 మంది పోలీస్ ఆమరవీరుల మరియు మెదక్ జిల్లాకు చెందిన 14 మంది పోలీసు అమరు వీరుల పేర్లను చదువుతూ..వారి యొక్కత్యాగాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి. ప్రతిమ సింగ్ గారు, జిల్లా అదనపు ఎస్.పి.డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు, మెదక్ డి.ఎస్.పి. శ్రీ సైదులు గారు,తూప్రాన్ డి.ఎస్.పి.శ్రీ.యాదగిరి రెడ్డి గారు, మరియు పోలీసు సిబ్బంది స్మరించుకోవడం జరిగినది. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ. ప్రతిమ సింగ్ గారు, జిల్లా అదనపు ఎస్.పి.డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు, మెదక్ డి.ఎస్.పి. శ్రీ.సైదులు గారు, తూప్రాన్ డి.ఎస్.పి.శ్రీ.యాదగిరి రెడ్డి గారు మెదక్ ఏ.ఆర్. డి.ఎస్.పి. శ్రీనివాస్ గారు, ఎస్.బి.సి.ఐ.శ్రీ.నవీన్ బాబు గారు, మెదక్ పట్టణ సి.ఐ.శ్రీ.మధు గారు, మెదక్ రూరల్ సి.ఐ.శ్రీ.విజయ్ గారు,అల్లాదుర్గ్ సి.ఐ శ్రీ.జార్జ్ గారు, ఆర్.ఐ. శ్రీ.నాగేశ్వర్ రావ్ గారు, ఐ.టి కోర్.ఎస్.ఐ. సందీప్ రెడ్డి గార్లు మరియు జిల్లా సిఐ.లు ఎస్ఐ.లు, ఆర్.ఎస్.ఐ. గార్లు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు ఆర్పించినారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ…. ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ది, నితీ, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని. దేశ వ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తుల ఆగడాలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వారే పోలీసులు అని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పరిష్కరానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. కావున పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఏంతో మంది పొలిస్ అధికారుల ప్రాణ త్యాగాల వలన మనం ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవించ గలుగుతున్నాం అని, వారి ఆశయాలను, ఆదర్శాలను కొనసాగించాలని అని అన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాము అని అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య ఉన్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మెదక్ జిల్లా అమరవీరుల కుటుంబాలను జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు పరామర్శించారు, ఈ కుటుంబాలను పోలీసు వ్యవస్థ తరపున అన్ని వేళలో ఆదుకుంటాము అని అన్నారు, తదుపరి అమరుల కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ తరపున జ్ఞాపికలను అందచేసారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సంధర్భంగా మెదక్ డి.ఎస్.పి శ్రీ.సైదులు గారు,మెదక్ పట్టణ సి.ఐ శ్రీ.మధు గారు,మెదక్ రూరల్ సి.ఐ.శ్రీ.విజయ్ గారు, జిల్లా పోలీస్ సిబ్బంది మరియు యువకులు 60 యూనిట్ల రక్త దానం చేయడం జరిగింది.