ప్రజావాణికి అనూహ్య స్పందన
ప్రజావాణికి రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదుదారులు
నల్లగొండలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావాణి నిర్వహణ
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ బ్యూరో,ఆగస్టు 29,(జనం సాక్షి)
నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రోజురోజుకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది.ముఖ్యంగా రాష్ట్ర మంత్రి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి పీర్యాదులను స్వీకరించి అప్పటికప్పుడే వారి సమస్యలను
పరిష్కరిస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతంగా నిర్వహించడం,మంత్రి స్వయంగా వ్యక్తిగత సమస్యలు,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా,అవసరమైన చేయూత నందిస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.ఎన్నికల అనంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం అత్యంత ఆదరణ పొందుతున్నది.ప్రజావాణి కొచ్చే లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ప్రత్యేకించి ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి ఆర్థిక సహాయం కోరగా తక్షణమే సహాయాన్ని అందిస్తున్నారు.దీంతో పాటు,ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు,
సహాయం అవసరమైన వారికి, సంస్థలకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికై వచ్చే దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వెంటనే మాట్లాడి వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు.ప్రత్యేకించి తమతోపాటు, ముఖ్యమైన అధికారులను రెవెన్యూ,పోలీస్,మున్సిపల్,ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్, ట్రాన్స్కో,డిఆర్డిఓ వంటి అధికారులు ప్రజావాణి కి హాజరై అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు.రాష్ట్ర మంత్రి ప్రజావాణి కార్యక్రమం లో సమస్యలను పరిష్కారం వేగవంతం చేస్తుండడాన్ని గమనించిన నల్గొండ జిల్లా ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చే సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది.ఎంతోమంది పేద విద్యార్థులకు మెడికల్,ఇంజనీరింగ్ సీట్లిప్పించడం,వారికి ఫీజులు చెల్లించడం,ఇంజనీరింగ్ తో పాటు,తక్షణం ఉపాధి కావాలని వచ్చే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఏదైనా సంస్థ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కృషి చేయడం,మహిళలకు కుట్టు మిషన్లు, స్వయం ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు వంటివి మంత్రి ఇప్పటివరకు ఎన్నో చేపట్టడం జరిగింది.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి వెంటనే మున్సిపల్ పార్కులో ప్రజావాణికి వెళ్లి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. గురువారం నాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి ఫిర్యాదులను సమర్పించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు తీర్చాలని పలువురు ప్రజలు కోరడమే కాకుండా,ఆర్థిక సహాయం అందించాలని,ఆరోగ్య విషయమై సహాయం చేయాలని,భూముల సమస్యలు,ఉద్యోగులు వారికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులను సమర్పించారు.ఈ సందర్బంగా జిల్లాకు యూరియా అవసరం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ మంత్రి దృష్టికి తీసుకురాగా,జిల్లాకు తక్షణమే నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఆర్ అండ్ బి రాస్త్ర అధికారులతో మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలను ఆర్ అండ్ బి రహదారులకు మంజూరు చేయడం జరిగిందని,ఇంకా రావాల్సిన165 కోట్లను తక్షణమే మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు తమకు బిఎల్ఓ విధుల నుండి తప్పించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.ఆర్ ఆర్డీవో రవి,వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్,డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి,ట్రాన్స్కో ఎస్ ఈ బాలరాజు,మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు,ఆర్ అండ్ బీ ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి తో పాటు,ఇతర అధికారులు,డిఎస్పి శివరాంరెడ్డి,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.