ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 29 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు.
రెవిన్యూ శాఖ 24, జిల్లా పంచాయితీ అధికారి 3, పోలీసు శాఖ, భువనగిరి మున్సిపల్ శాఖ ఒక్కొక్కటి చొప్పున మొత్తం 29 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఒక వేళ జిల్లా అధికారి హాజరు కాలేని పరిస్థితి ఉంటే బాధ్యత కలిగిన తదుపరి అధికారులు హాజరు కావాలని, ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణిలో కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.