ప్రజావాణి ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 62 ఫిర్యాదులను ఆమె అందుకున్నారు.
50 రెవిన్యూ శాఖ, 4 జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సర్వే ల్యాండ్ రికార్డ్, జిల్లా ఉపాధి కల్పన, జిల్లా పంచాయతీ కార్యాలయాలు 2 చొప్పున, నీటిపారుదల శాఖ, పోచంపల్లి మున్సిపాలిటీ ఒక్కొకటి చొప్పున మొత్తము 62 ఫిర్యాదులు అందాయి.
ప్రజావాణిలో కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్
విజయ కుమారి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.