ప్రజాసమస్యలపై పోరు

గుంటూరు,నవంబర్‌28(జనం సాక్షి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో సిపిఎం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సిపియం జిల్లా నాయకులు బైరగాని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలింబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ జరిగే పోరాటాలు ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. పల్నాడు ప్రాతంలో కార్మిక వర్గం ఏలాంటి చట్టపరమైన సౌకర్యాలు అమలు కాక దుర్భర స్థితిలో జీవిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కార్మిక చట్టాల అమలు కోసం జరిగే పోరాటాల్లో కార్మిక వర్గం ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.ప్రధానంగా విద్య, వైద్య రంగాల్లో వంద పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ, ఇంజినీరింగ్‌, వృత్తి, వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సిమెంట్‌ సేకరించిన భూములు పరిశ్రమలు పెట్టకుంటే రైతలకు సాగుకు ఇవ్వాలని తీర్మానించారు. పట్టణంలో రక్షత మంచినీటి సమస్యను పరిష్కరించాలని తీర్మానించింది.