ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కులేదా?

2

– జనార్ధన్‌రెడ్డిపై దాడికి యత్నం

మహబూబ్‌నగర్‌,జులై 2(జనంసాక్షి): పాలమూరు ప్రాజెక్టులపై బిజెపి నేత నాగం జనార్దన్‌ రెడ్డి  కేసువేయడంపై టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యకర్తలు  భగ్గుమన్నారు. ప్రాఎక్టులను అడ్డుకోవడం ద్వారా పాలమూరును వెనకబడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీంతో  మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో భాజపా నేత నాగం జనార్దన్‌రెడ్డి ఏర్పాటు చేసిన విూడియా సమావేశాన్ని తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నాగం అనుచరులు, తెరాశ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఘర్షణలో ఆర్‌అండ్‌బీ కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. నాగం జనార్ధన్‌ రెడ్డి అక్కడ విూడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నాగంకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో నాగం అనుచరులు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల పరస్పరం తోపులాటకు దిగడంతో పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. ఈ ఘర్షణతో ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఫర్నిచర్‌ ధ్వంసమైంది. మహబూబ్‌ నగర్‌ లో బిజెపి సీనియర్‌ నేత ,మాజీ మంత్రి డాక్టర్‌ నాగం జనార్దనరెడ్డి కి ,టిఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య వివాదం ముదురుతోంది. ప్రాజెక్టులపై నాగం చేస్తున్న విమర్శలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయన నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.దాంతో ఇరువైపులా తోపులాటలు జరిగాయి. మహబూబ్‌ నగర్‌ బిజెపి ఆఫీస్‌ లో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు చొరబడి గందరగోళం సృష్టించారు.అయితే తాను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, కేవలం కాంట్రాక్టుల కేటాయింపు తీరుపైనే నిరసన తెలుపుతున్నానని నాగం అన్నారు.