ప్రజాస్వామ్యంవైపు అడుగులేయండి
– ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రధాని మోదీ
కాబూల్,డిసెంబర్25 (జనంసాక్షి): అఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి భారత్ అన్ని విధాల సహకరిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అఫ్ఘనిస్థాన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ కాబూల్‌లో నూతనంగా నిర్మించిన ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పార్లమెంట్‌నుద్దేశించి మోదీ ప్రసంగిచారు. అఫ్ఘనిస్థాన్ ప్రజలు ఓటుతో భవితవ్యాన్ని నిర్దేశించుకున్నారన్నారు. ఆయుధాలకు చరమాంకం పలికి ప్రజాస్వామ్యానికి తెరలేపారని ప్రశంసించారు. నూతన పార్లమెంట్ భవనం సాక్షిగా ఇరు దేశాల మధ్య ఆలోచనాత్మక సంబంధాలు బలోపేతమవుతాయన్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోని ఓ బ్లాక్‌కు అటల్ పేరు పెట్టడం గర్వకారణమన్నారు. ఇరు దేశాల స్పూర్తికి అటల్ బ్లాక్ బాసటగా నిలుస్తుందని మోదీ అన్నారు. రెండు దేశాలను మరింత దగ్గర చేస్తుందన్నారు. కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ దేశ ప్రగతికి ఓ నివాళిగా అందించినట్లు మోదీ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సాధిస్తున్న విజయాల పట్ల మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ వీరయోధుల దేశమని, దేశ ప్రజలు హింసను వదలి, ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారని మోదీ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ స్వాలంబన కోసం అవసరమైన ప్రతి సాయాన్ని భారత్ అందిస్తుందన్నారు. అప్ఘనిస్థాన్ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి భారత్ అండగా నిలుస్తుందన్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో ఒక బ్లాక్‌కు అటల్ పేరు పెట్టడం చాలా అనందంగా ఉందన్నారు. ఈ పార్లమెంట్ భవనం రెండు దేశాలు, జాతుల మధ్య వారధిగా నిలుస్తుందన్నారు. 500 మంది ఆప్ఘన్ అమరవీరుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తామని ఈసందర్భంగా మోదీ ప్రకటించారు. అప్ఘనిస్థాన్, భారత్ ప్రజల మధ్య ఒకరిపై ఒకరికి హద్దులు లేని బంధం ఉందన్నారు. వచ్చే ప్రపంచకప్ కోసం ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు దిల్లీలో సన్నద్ధమవుతున్నారని మోదీ తెలిపారు.అంతకుముందు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రష్యా నుంచి అప్ఘనిస్థాన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆ దేశ అధ్యక్షుడు, మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ అఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అప్ఘన్ ప్రజలు ఓటుతో తమ భవితవ్యాన్నినిర్దేశించుకున్నారని కొనియాడారు. ఆయుధ సంస్కృతిని వీడి ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారని వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి అవసరమైన సాయాన్ని భారత్ అందజేస్తుదని హావిూ ఇచ్చారు. అప్ఘన్ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి భారత్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కాగా 500 మంది ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులకు భారత ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది. ఉగ్రపోరులో ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళ సిబ్బంది పిల్లలకు ఆ స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు. 500 మంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ కాబూల్‌లో ఆ దేశ పార్లమెంట్ భవనంలో మాట్లాడిన మోదీ ఈ వాగ్దానం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ దేశ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు. ఆఫ్ఘన్ సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ సహకరిస్తుందన్నారు. తాము పోటీకి రావడం లేదని, కేవలం సహకారం అందించేందుకు వస్తున్నామన్నారు. భారత ప్రజల మనస్సులను దోచుకునే కాబూలీవాలా రావాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా వుండగా ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ సహకారంతో ఆ బిల్డింగ్‌ను నిర్మించారు. సుమారు వెయ్యి కోట్లతో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. 2007లో బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైంది. ఓ బహుమానంగా పార్లమెంట్ భవనాన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ అందించింది. దీని కోసం ఉభయసభలను ఆ భవనంలో నిర్మించారు. దిగువ సభలో 294 సీట్ల సామర్థ్యం ఉంది. ఎగువ సభ సామర్థ్యం 192 సీట్లు. ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో సహ పలువురు మంత్రులు కొత్త భవనాన్ని మోదీకి పరిచయం చేశారు. ఆఫ్ఘన్ పార్లమెంట్ కొత్త భవనానికి అటల్ బ్లాక్‌గా నామకరణం చేశారు. మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృత్యర్థం ఆ పేరును పెట్టారు
.