ప్రజాస్వామ్య హక్కులకు భంగం: న్యూడెమోక్రసీ

ఖమ్మం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకురాలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్‌లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని అన్నారు. అలాగే ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. అనేక హావిూలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం హావిూలను విస్మరించిందని అన్నారు. కేవలం ఓ కుటుంబం మాత్రమే పాలన చేస్తోందని ప్రశ్నించే గొంతులను నులిమేసే వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తామని చెప్పినా అమలు కాలేదన్నారు. పోడు రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితులు, గిరిజనులకు భూపంపిణీ చేయకపోగా, ప్రాజెక్టుల నిర్మాణం, హరితహారం పేరిట పోడు చేసుకుంటున్న గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుంటుందని విమర్శించారు. అమరుల స్ఫూర్తియాత్ర నిర్వహిస్తున్న కోదండరాంను, ఐకాస నేతలను అరెస్టు చేయించడం, యాత్రపై దాడులు జరిపించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు మరింత బలంగా చేపట్టాలని వారు పిలుపునిచ్చారు.

—–