*ప్రజా అభిష్టాన్ని గౌరవించరా.ఎమ్మెల్యే జోగు రామన్న*

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
ఓట్లు వేసే గెలిపించుకున్న వారి అభీష్టాన్ని గౌరవించరా. సొంత లాభార్జన కోసం రాజకీయం చేస్తారా ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని. సొంత లాభార్జన కోసం ఉప ఎన్నికలు సృష్టిస్తారా అని ఎమ్మెల్యే జోగు రామన్న గారు..అన్నారు.నేడు
మునుగోడు ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కు ఇంచార్జీగా నియమించిన గ్రామాలు మర్రిగూడ మండలంలోని తిరుగండ్ల పల్లి, తమ్మడిపల్లి గ్రామాలకు సంబందించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు రాములు, చిన జంగయ్య, ఎల్లయ్య, జంగారెడ్డి, సత్తయ్య, వెంకటయ్య తదితర 70 మంది నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి జోగు రామన్న నాయకత్వం లో టి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత లాభాపేక్ష కోసం  ఓట్లు వేసిగెలిపించిన ప్రజా అధిష్టాన్ని వ్యతిరేకిస్తూ తన సొంత లాభాపేక్ష కోసం ఉప ఎన్నికలు వచ్చేలా చేసి రాజగోపాల్ కాదా అని ప్రశ్నించారు. లాభాపేక్ష కోసం  వచ్చే నాయకులు మాత్రమే ఉప ఎన్నికల పేరు మీద ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను తిరస్కరిస్తూ ప్రజల అదృష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ గ్రామాలను పట్టలను అభివృద్ధి చేస్తూ. రైతాంగం. వృద్ధుల పింఛన్లు. నీటి ప్రాజెక్టులు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి మహోన్నత పథకాలు ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ వారి ఆశీర్వాదాన్ని పొందుతున్నాయి అన్నారు..
   ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రచార బృందం నాయకులు మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ దివిటి రాజు. సంతోష్. బుట్టి శివ. ప్రశాంత్. సాయికుమార్..తదితరులు పాల్గొన్నారు.
Attachments area