ప్రజా ఉద్యమంగా మిషన్ కాకతీయ

చెరువుల పునరుద్ధరణను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చెరువులు తెలంగాణ వారసత్వ సంపదన్నారు. సీమాంధ్ర పాలకులు ఆరు దశాబ్దాలు చెరువులను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. చెరువులను రాత్రింబవళ్లు కష్టపడి పునరుద్ధరించుకుంటే.. సాగునీటి, తాగునీటికి ఢోకా ఉండదన్నారు. చెరువు పూడికమట్టితో ఎన్నో లాభాలున్నయని.. రైతులు స్వచ్ఛందంగా పూడికమట్టిని పొలాల్లో తీసుకుపోవాలని హరీశ్ రావు సూచించారు.
మిషన్ కాకతీయలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో వ్యవసాయం చెరువులు, బోర్లపైనే ఆధారపడి ఉందన్నారు. పారదర్శకంగా మిషన్ కాకతీయను చేపట్టామని.. ఆన్ లైన్లో టెండర్లను పిలుస్తున్నమన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నయని మంత్రి పోచారం అన్నారు.