ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా
.రఘునాధపాలెం సెప్టెంబర్ 9 జనం సాక్షి. ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ ఖమ్మంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లింగాల రవికుమార్ మాట్లాడుతూ నాడు హైదరాబాద్ సంస్థానంలో నైజాం పాలనకు నియంతృత్వానికి వ్యతిరేకంగా న్యాయవాద వృత్తిని వదిలి నిజాం నిరంకుశ పాలన అంతానికి ఉద్యమాలు నిర్వహించి తన గళాన్ని ఎత్తి తన కవితల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు కాళోజీ అని పీపుల్స్ వారు ఎన్నికలను బహిష్కరించిన ఖాతరు చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్న గొప్ప ప్రజాస్వామ్యవాది కాలోజి అని లింగాల రవికుమార్ అన్నారు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అని అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడని ఎలుగెత్తి చాటిన గొప్ప ప్రజాకవి కాలోజీ అని లింగాల రవికుమార్ కొనియాడారు ఎంతటి వారు నైనా ఎదిరించి ప్రశ్నించి దిక్కరించే దీశాలి మన కాళోజి అని లింగాల రవికుమార్ అన్నారు కాలోజీ ఉద్యమ స్ఫూర్తిని కాలోజీ తెగింపును నేటి తరం యువత నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని లింగాల పిలుపునిచ్చారు కాళోజీ పుట్టినరోజుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకోవడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర గంగాధర్ కొట్టే సుధాకర్ కార్యదర్శి జి శంకర్ నాయకులు వినోద్ పి రామారావు తదితరులు పాల్గొన్నారు