ప్రజా సంక్షేమానికి కార్యకర్తలు కట్టుబడి ఉండాలి : బొత్స

హైదరాబాద్‌ : ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ కట్టుబడి ఉండాలని పీసీసీ అధినేత బొత్స పిలుపునిచ్చారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో బొత్స ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి సూచనలు స్వీకరించేందుకే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధికారంలోకి రావాలనే కాంగ్రెస్‌పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలు ఏనాడు చేయలేదని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో 10,15 రోజుల్లో పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.