ప్రజా సమస్యలపై సర్వే
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు,ఇండ్ల స్థలాల కోసం ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాకు ప్రజలు దరఖాస్తులతో వేలాదిగా తరలిరావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక కుమ్మరి బజార్ లో ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో అనేకమంది పేదలు అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో కొన్ని చోట్ల పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు ఇవ్వడం లేదన్నారు.కొన్ని ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని అన్నారు. ప్రజలు ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలన్నారు.ఈ సర్వేలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ , పిఎన్ఎం జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న , పట్నం జిల్లా కన్వీనర్ జె.నర్సింహారావు , రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత , ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎలుగురి జ్యోతి, సుల్తానా , దేవలక్ష్మి, పద్మ, లక్ష్మీ, సునీత తదితరులు పాల్గొన్నారు.
Attachments area