ప్రణబ్‌కు సీఎం అభినందనలు
హైదరాబాద్: భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ముఖర్జీకి ముఖ్యమంత్రి కిరణ్‌కూమార్ రెడ్డి రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు తెలిపారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో ప్రణబ్‌కి సముచిత స్థానం ఉందని, మంచి పరిపాలనాదక్షుడని, రాష్ట్రపతి పదవికి ఆయన తగిన వారని కొనియాడారు. అపారమైన అనుభవంతో దేశానికి, ప్రభుత్వానికి సరైన నిర్దేశనం చేయగల వ్యక్తిగా ప్రణబ్ రాష్ట్రపతి పదవి ఔన్నత్యాన్ని మరింతగా కాపాడగలరన్న విశ్వాసం సీఎం వ్యక్తం చేశారు.