ప్రతిభగల క్రీడాకారిణికి చేయూతనిద్దాం

ధర్మపురి ( జనం సాక్షి )ధర్మపురికి చెందిన రంగు విరంచి స్వప్నిక ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుంది.
స్వప్నిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేయగా, మొదటినుండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంది.
వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో జాతీయస్థాయిలో పథకాలు సాధించిన స్వప్నిక ఈ నెల ( ఆగస్ట్) లో షార్జాలో జరగనున్న ఏషియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ కప్ పోటీలో పవర్ లిఫ్టింగ్ విభాగంలో పాల్గొనడానికి అర్హత సాధించింది.
ఇట్టి పోటీలో పాల్గొనడానికి భారతదేశం నుండి ఆరుగురు అర్హత సాధిస్తే అందులో స్వప్నిక ఒకరు.
స్వప్నిక తల్లిదండ్రులు ( శ్రీలత, వెంకటరమణ) మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైనప్పటికీ కూతురు చదువుతోపాటు, క్రీడల్లో ప్రోత్సహించడానికి శక్తికి మించి కష్టపడుతున్నారు.స్వప్నిక తండ్రి వెంకట రమణ తను సంపాదించే డబ్బు ఇంటి రెంట్ ,చదువులు,కుటుంబ ఖర్చులకు సరిపోతుండగా, కూతురుకు రోజూ పోషకాహారం అందించడం, ఇతర ఖర్చులు భారంగా మారాయి.ప్రస్తుతం స్వప్నిక షార్జా వెళ్లాలంటే సుమారు రూ. 1.50 లక్షలకు పైగా ( ఫ్లైట్ చార్జెస్,వారం రోజులు బోర్డింగ్, ఇతర ఖర్చులు) ఖర్చు చేయాల్సి ఉండగా, ఇట్టి ఖర్చులు తల్లిదండ్రులకు భారంగా మారాయి.
షార్జాలో జరగనున్న ఏషియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ కప్ పోటీల్లో పాల్గొనడానికి స్వప్నికకు చేయూతనిద్దాం.

తాజావార్తలు