*ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం-

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి*

 

పెద్దేముల్ సెప్టెంబర్ 24 (జనం సాక్షి)
రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకమం అందేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బతుకమ్మ చీరాల పంపిణీలో భాగంగా పెద్దేముల్ మండలంలోని గాజీపూర్, నాగులపల్లి, మారేపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని అన్నారు. పెద్దేముల్ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దశలవారీగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. అర్హులందరికీ బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ రమేష్,జెడ్పిటిసి ధారాసింగ్ నాయక్,వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి,తహసిల్దార్ మహేష్,ఆర్ ఐ రాజిరెడ్డి,సర్పంచులు భాగ్యలక్ష్మి,వీరప్ప,శ్రావణ్ కుమార్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, ఎంపిటిసి స్వప్న మధుసూదన్ రెడ్డి,సురేఖ,మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి,నాయకులు మారేపల్లి వెంకట్ రెడ్డి,రమేష్, శ్రీనివాస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.