ప్రతి ఇంటికి 2 లక్షల ఆర్థిక సాయం అందించాలి
వరంగల్ బ్యూరో, జులై 29 (జనం సాక్షి)గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమైందని వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఉన్నటువంటి తట్టు ప్రాంతాలు ప్రజల ఇండ్లలోకి మీరు చేరి నిత్యవసర వస్తువులతో పాటు టీవీ ఫ్రిడ్జ్ బైక్ సామాగ్రి మరియు వారి జీవనోపాధి కోల్పోవడం జరిగింది అందుకుగాను ప్రభుత్వం తక్షణ సాయం కింద ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు సాయం అందించాలని వరంగల్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళి గౌడ్ అన్నారు ఈ మేరకు విలేకరుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు ఆక్రమణలు చెరువు కబ్జాలు నాలాల కబ్జాలు ఉన్నటువంటి భూములను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేయడం వలన వర్షపు నీరు సక్రమంగా కాలువలు నిర్మాణం చేయకుండా ఉండడం వలన ఈరోజు లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో మునిగిపోయినాయి అన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు వరంగల్ తూర్పు నియోజకవర్గం 3600 కోట్ల అభివృద్ధి పనులు జరిపామని చెప్పుకుంటూ వర్షపు నీటిలో ట్రాక్టర్ల మీద జెసిబి ల మీద తిరుగుతూ వీరి యొక్క అభివృద్ధిని చాటుకున్నారు ఇప్పటికైనా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు మేము చేసిన అభివృద్ధి శూన్యం తెలుసుకొని తక్షణసాయంగా సామాన్య ప్రజలకు ప్రతి ఇంటి ఇంటికి రెండు లక్షల రూపాయలు సాయం చేయవలసిందిగా స్వప్న మురళి గౌడ్ డిమాండ్ చేశారు . లేనిపక్షంలో కొండా దంపతుల ఆధ్వర్యంలో హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏ విధంగా ముట్టయించినారు వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ ని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ముట్టడించడం జరుగుతుంది ఎన్ హెచ్చరించారు.
ఈ యొక్క కార్యక్రమంలో వరంగల్ సిటీ మహిళా అధ్యక్షురాలు నారగోనిస్వప్న మురళి గౌడ్, మీసాల ప్రకాష్ ,42వ డివిజన్ అధ్యక్షుడు ఇటుకల అశోక్ ,39 డివిజన్ అధ్యక్షుడు షేర్ల కిషోర్, 28వ డివిజన్ అధ్యక్షుడు కురిమిళ్ళసంపత్, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొండ అభిమానులు పాల్గొనడం జరిగింది.