ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి : పరిగి డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి

పరిగి రూరల్​, అక్టోబర్​ 8, ( జనం సాక్షి ) :
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పరిగి  డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగిలో శనివారం మిలాద్​ కమిటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు.ఈ రక్త దాన శిబిరానికి  పరిగి డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజయర్యయ్యారు. అనంతరం డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రమాదాలు జరిగి రక్తం కోల్పోయిన వారికి ప్రాణ వాయువును అందిచనవారవుతారన్నారు. అనంతరం పరిగి ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయాలని ముందుకు వచ్చిన వారందరికి అభినందనలు తెలియజేశారు.   మిలాద్​ కమిటీ సదర్​ అజర్​ మాట్లాడుతూ మహ్మద్​ ప్రవక్త, మిలాద్​ ఉన్​ నబీ పండగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 105 దాతలు రక్తం ఇచ్చారని తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి పుష్పల పౌండేషన్​ ఆధ్వర్యంలో ఉచితంగా రక్తదానం అందిస్తుండటంతో సేకరించిన రక్తదాన్ని వారికి అందజేస్తున్నామని మిలాద్​ కమిటీ సదర్​ అజర్​ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖదీర్​, నజీమొద్దీన్​, ఆసీప్​, ఖలేద్​,  తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్​ :
08 పిఆర్​ జి 02లో పరిగిలో మిలాద్​ కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్న డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి,పక్కన ఎస్​ఐ పి. విఠల్​ రెడ్డి శారు. నజీమొద్దీన్​, ఆసీప్​, ఖలేద్​,
Attachments area