ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి… డిసిపి సీతారాం

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో దాతల సహాయం ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాలు అరికట్టడంలో పోలీసులకు ప్రజల సహకరించాలని జనగామ డిసిపి సీతారాం అన్నారు. బుధవారము పోచన్నపేట గ్రామంలో దాతల సహకారంలో 25 సీసీ కెమెరాలు. మెయిన్ రోడ్లకు వీధులకు అమర్చిన ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసిపి దేవేందర్ రెడ్డి తో కలిసి ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలను నివారించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామాలలో పట్టణాలలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తుందని వారు తెలిపారు. ప్రజలకు సీసీ కెమెరాలు ద్వారా ఎంతో రక్షణ కల్పించవచ్చని అందుకని గ్రామంలోని మేధావులు దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాలు గ్రామాలకు డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్. సృజన్ కుమార్. గ్రామ సర్పంచ్ గట్టు మంజుల. ఎంపీటీసీ ప్రజలు పాల్గొన్నారు