ప్రతిఘటన తప్పదు: కేటీఆర్
చేగుంట: తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తరువాతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్ జిల్లాలో అడుగు పెట్టాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో ఆదివారం కేటీఆర్, ఎంపీ విజయశాంతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, తెదేపా, వైకాపాలు ఏదో ఒక రూపంలో తమ ప్రాంతంలో అడుగు పెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. వారికి ప్రజల నుంచి ప్రతి ఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. పోలీసులతో నిర్వహించే ఇందిరమ్మబాట ఎవరికోసం అని ఆయన ప్రశ్నించారు. యాచించి కాకుండా శాసించి తెలంగాణ తెచ్చుకుంటామని అన్నారు.