ప్రతి మండలంలో ఒక మోడరన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

వనపర్తి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి రావు .

వనపర్తి బ్యూరో అక్టోబర్ 28 (జనంసాక్షి)

వనపర్తి జిల్లా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి మండలంలో ఒక మోడరన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వనపర్తి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి రావు సూచించారు. శనివారం మధ్యాహ్నం ఐ.డి. ఒ.సి ప్రజావాణి హాల్లో సహాయ రిటర్నింగ్ అధికారులు, బి.ఎల్. ఒ సూపర్వైజర్లతో మోడరన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వనపర్తి నియోజకవర్గంలో 5 మహిళా మోడ్రన్ పోలింగ్ స్టేషన్ లు, ఒక దివ్యంగుల మోడ్రన్ పోలింగ్ స్టేషన్, ఒకటి యువత తో కూడిన మోడ్రన్ పోలింగ్ స్టేషన్ తో పాటు మండలానికి ఒకటి చొప్పున 7 మోడ్రన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా సుచించిందన్నారు. అందువల్ల వనపర్తి నియోజకవర్గంలో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మోడ్రన్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సహాయ రిటర్నింగ్ అధికారులు, బి.ఎల్. ఒ సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు .