ప్రతీ డివిజన్ కేంద్రంలో ఎంసీహెచ్—– ———=———–
– కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు
– మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
– రూ. 175కోట్లతో 100 పడకల మాతా -శిశు సంరక్షణ ఆస్పత్రికి మంత్రి భూమిపూజ
కామారెడ్డి,జనం సాక్షి ) : రాష్ట్రంలోని ప్రతీ డివిజన్ కేంద్రంలో 100 పడకల మదర్ కేర్ చైల్డ్(ఎంసీహెచ్) ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రూ. 17 కోట్లతో బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న 100 పడకల మాతా-శిశు సంరక్షణ ఆస్పత్రికి మంత్రి పోచారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా ఎంసీహెచ్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గర్భిణీలకు సౌకర్యవంతం కోసం హాస్పిటల్స్‌లో అమ్మ ఒడి వాహనాలను సమకూర్చామని మంత్రి చెప్పారు. రాష్ట్రం వైద్యరంగాన్ని బలోపేతం చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి పీహెచ్‌సీలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, రాబోయే కాలంలో కార్పొరేట్ ఆస్పత్రుల వలే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందించేలా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మే 10 నుంచి రైతులకు పెట్టుబడి చెక్కులను అందించటం జరుగుతుందన్నారు. రాబోయే ఖరీఫ్, రబీలకు రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పాల్గొన్నారు.