ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నం

మూడు నెలలపాటు రాష్ట్రవ్యాప్త చర్చలు

లెఫ్ట్‌ పార్టీల సదస్సులో మధు వెల్లడి

విజయవాడ,జూన్‌20(జ‌నం సాక్షి ): టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపి, వైసిపి పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బుధవారం నాడిక్కడ జరిగిన రాష్ట్ర సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. అనంతరం ఈ మేరకు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. మధు మాట్లాడుతూ.. పేదల, రైతులు, దళితులు, కార్మికుల భవిష్యత్తు, సంక్షేమం కోసం ఉద్యమిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంద్ర వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యామ్నాయ మార్గం పై మూడు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరపాలని సూచించారు. బలవంతంగా గిరిజన, దళితులకు చెందిన పది వేల ఎకరాల భూములను ప్రభుత్వం లాగేసుకుందని, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, దళితులకు రాష్ట్రంలో రక్షణ లేదని అన్నారు. నిర్బంధం, అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని అణచి వేస్తున్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు15 భారీ ప్రజాగర్జన కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తామని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ.. దేశం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. బీజేపీ, టీడీపీ, అవకాశవాద రాజకీయలు చేస్తున్నాయని, ప్రతిపక్షాలు ప్రత్యేక ¬దా గురించి అడిగితే పార్లమెంట్‌ ను నడవనివ్వలేదని చెప్పారు. మోడీకు పార్లమెంట్‌ అంటే గౌరవం లేదన్నారు. ఒక్క కాశ్మీరే కాదు దేశాన్నే బీజేపీ సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొన్నారు. బీజేపీ హటావ్‌, దేశ్కిబచావ్‌ స్లోగన్‌ తో అందరం ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. అనంతరం..సీపీఎం జాతీయ నాయకులు బి.వి. రాఘవులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతిలో పెడుతుందన్నారు. రాష్ట్ర విభజన వద్దు అంటే చేశారు కానీ రాష్ట్రాన్ని అనైతికంగా విభజించారు. ఎస్‌ సి, ఎస్‌ టి చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దళితులు ఆందోళనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కాల్చి చంపలేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హౌదా పదిహేనేళ్ల కావాలన్న వెంకయ్యనాయుడు ఎక్కడ ఉన్నారన్నారు. విభజన చట్టంలో చాలా హావిూలు ప్రకటించి చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం పార్లమెంట్‌ లో చట్టం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయలో 98 వేల కోట్ల అప్పు ఉంది. ప్రస్తుత రాష్ట్ర అప్పు రూ.2.49 లక్షల కోట్లు.. చంద్రబాబు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పల ఊబిలో దింపారని చెప్పారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత టీడీపీ, వైసీపీ పార్టీలకు లేదని పేర్కొన్నారు.