‘ప్రత్యేకం’ కన్నా ముందస్తు భేటీనే మేలు!

` పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుష్మాస్వరాజ్‌
`ఆహర భద్రతకు వ్యతిరేకం భాజపా నేత
న్యూఢల్లీి : ఆహర భద్రత బిల్లుకు ఆమోదం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పర్చటం కన్నా వర్షాకాల సమావేశాలనే ముందుకు జరిపితే బాగుంటుంని భారతీయ జనతా పార్టీ అభిప్రాయ పడిరది. ఈ బిల్లుకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందకు తాము వ్యతి రేకం కాదని ఆ పార్టీనేత సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. ఆహర బిల్లు ఆర్డినెన్స్‌ ద్వారా అమలు లోకి తెచ్చే అంశమూ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు మీడియా వార్తల ద్వారా తెలుస్తోందని, అదెంత మాత్రం సమర్థనీయం కాదని సుష్మా స్పష్టం చేశారు. ఆహర భద్రత బిల్లు విషయమై చర్చించి ఏ నిర్ణయమూ తీసుకునేందుకు సోమవారం యూపీఎ భాగస్వామ్య పక్షాలు చర్చించుకున్న ఆదే అంశం  తర్వాత ఆదే సమావేశాల్లోనే ఆహర భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్రం ప్రభుత్వం భావించి నప్పటికి సభా కార్యక్రమాలు సజావుగా కొనసాగక పోవడంతో సాధ్యం కాలేదు.